21-Dec-2010

ఇష్టం

ఇష్టానికి మరణం ఉండదు
ఇష్టం ఉన్నపుడు కష్టానికి జననం ఉండదు!

ఇష్టానికి మరణం ఉండదు
ఇష్టం ఉన్నపుడు నష్టానికి జననం ఉండదు!

18-Dec-2010

అతను - ఆమె

అతను - చందమామ
ఆమె - వెన్నెలమ్మ
చందమామ, వెన్నెలమ్మ రెండు కాదు ఒకటే.

16-Dec-2010

ప్రేమంటే...

ఒక్కోసారి అనిపిస్తుంది ప్రేమంటే -

"రెండు బలహీన హృదయాలు చాలా బలంగా ఇష్టపడడం" అని.

మన ప్రాణాలన్నీ...

నీ ఒంట్లో నలతగా ఉందంటేనే
నా మనసు ఎంతో కలత చెందుతుంది!
నా పంచ ప్రాణాలూ నీ ఒక్క ప్రాణమే అంటే
నా ఒక్క ప్రాణం కోసం నీ పంచ ప్రాణాలు పనంగా పెట్టవా?
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
కష్టం నీది అనుభవించాలని.. సంతోషం నీతో అనుభవించాలని...

15-Dec-2010

అహం-ప్రేమ

అహం ఉన్న మనసులో
ప్రేమ ఉండొచ్చు
కాని నిలవదు!
ప్రేమను కోల్పోయాక
అహం కూడా చచ్చిపోతుంది,
అప్పటికే అంతా మించిపోతుంది.