ప్రియా!
నిలువెత్తు సాక్ష్యంగా నువ్వు నా చెంత లేనపుడు
ఎంత దగ్గరలో ఉన్నా వేయి యోజనాల దూరమే,
నా మనసులో ఆసాంతం నీవు నిల్చినపుడు మాత్రం
ఎంత దూరంలో ఉన్నా కౌగిలిపాటు దగ్గరే...
25-Dec-2009
దూరం - దగ్గర
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 4:26 AM 1 మీ నుండి...
విభాగం ప్రేమ
23-Dec-2009
దాసి - మంత్రి - మాత - రంభ
ఆకాశం నుండి నీవు అభిసారికలా వచ్చినావు,
పరిచారికగా మారి పరిచర్యలు చేసినావు,
ఆకలినే తీర్చివేసే అమ్మగా ఎదిగినావు,
ఆలింగనాల ఒరవడిలో అలజడినే తీర్చినావు,
ఆలోచనలో అనుక్షణం మంత్రిగా ఒదిగినావు,
మనసంతా అణువణువూ మురిపెంగా నిలిచినావు...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 6:10 PM 0 మీ నుండి...
విభాగం ప్రేమ
నీ చలనచిత్రాల జ్ఞాపకాలు...
... పగిలిపోయిన హృదిలో
నీవొదలిపోయిన జ్ఞాపకాలు,
... రగిలిపోయిన మదిలో
నిలిచిపోయిన నీ చలనచిత్రాలు
కలసి... వెరసి...
వెర్రెక్కిస్తున్నాయంటే నమ్మగలవా...
ప్రియా!
వెక్కిరిస్తుంటే మాత్రం నువ్వు చూడగలవా?
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 5:39 PM 0 మీ నుండి...
ఆమె చూస్తే కనుక...
ఆమె చూస్తే కనుక, ఆమె వెనుకే పడక
ఆమె వెంటే నడక, నడక మించిన పరుగు...
వగర్చి వగర్చి...
... పరుగులెడితే నీవు జారిపడతావు,
తెరిచిఉంచేవూ హృదయం పగిలిపొయ్యేను,
నలిగిపోయిన పయనం బరువు తోచేను,
ప్రాణముంటేనా బ్రతుకు? కాష్టమల్లే నడచు...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 5:06 PM 0 మీ నుండి...
విభాగం విరాగం
ప్రభూ...
... రాధను మాత్రం కాను,
ప్రేమారాధనను నేను,
బాధను మాత్రమే కాను,
యదార్ధగాధను నేను.
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 10:05 AM 1 మీ నుండి...
విభాగం ప్రేమ
19-Dec-2009
కృతజ్ఞతలు...
... నేనే నీకు చెప్పాలి కన్నా కృతజ్ఞతలు
నీవన్నీనేను దోచుకున్నాను,
జ్ఞాపకాల పుస్తకంగా దాచుకున్నాను,
ఎపుడు కావాలంటే అపుడు చదువుకుంటాను...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 3:37 PM 2 మీ నుండి...
విభాగం ప్రేమ
13-Dec-2009
నా లోకం నుండి లోకానికి...
..........................నీవు లేని చోట నేనున్నా
దరి చేరని దారుల మాటున
మాటే మౌనం... మనసే ధ్యానం...
......................... జనించు ఊహల సృష్టి...
ఈ కవనం... ఈ కధనం...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 9:12 AM 0 మీ నుండి...
విభాగం విరహం
మనలో మన మాట - 5
జీవితం కలల సాక్షాత్కారం... ఇంత చిన్న జీవితానికి పెద్ద ఆంక్షలన్నవే ఎందుకు? ఏదీ నైతికతను, ఒక నిబద్ధతను దాటిపోనంత వరకూ జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని ఇస్తూనే ఉండాలి. కష్టపడేటపుడు ఇంతకంటే ఇంకా ఎక్కువ కష్టపడగలమేమో చూసి కష్టపడగలగాలి, సుఖపడేటపుడు, ఆనందించేటపుడు ఇంతకంటే ఇంకా ఎక్కువ ఆనందిచవచ్చేమో చూసి ఆనందించాలి...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 8:52 AM 1 మీ నుండి...
విభాగం మనలో మన మాట
07-Dec-2009
గతమైన వర్తమానం
మేడమెట్లపై
శీతాకాలపు సాయంత్రపు నీరెండకు ఎదురుగా కూర్చుంటే
గతమంతా వర్తమానమైనా, వర్తమానం మాత్రం గతంలో నిలిచినట్లు...
చేతిలో కాఫీ కప్పు , మనసులో నీ ఆలోచనలు
వెరసి మనసొక వేదికైతే జరిగేదంతా వేడుకే మరి...
నేను - నువ్వు - నీ అల్లరి - నును వెచ్చని నీ చేతుల్లో నా మోము
దరిచేర్చుకునే నీ అధరాలు... సిగ్గుల సాక్ష్యులకాధారాలు...
వద్దని అంటానే కాని పొమ్మని విదిలించని నా మనసు, కావాలనిపించే వయసు...
ఆ తరువాతైనా ఆగని నీ పయనాలు, నన్నంతా వేదికేసే నీ నయనాలు...
నేనెంత ఒదిగినా, నీ ఒపికంతా ఊపిరులై ఎగిసేవేళ
నా అణువణువూ మనసునే నింపుకుంటాను, నీవిచ్చే అనుభవమంతా జ్ఞాపకమై నిలుపుకుంటాను...
చివరకి నా చేతులే నన్నుకౌగిలించుకునేవేళ
ఈ వర్తమానపు వేదికపైకి సిగ్గుతో తలదించుకొని తిరిగి వస్తాను
అయినా ఇవన్ని తిరిగి తిరిగి చేస్తాను
నువ్వు తిరిగొచ్చే వరకూ... మరల 'అది' చేసేవరకు...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 7:20 AM 2 మీ నుండి...
విభాగం విరహం
06-Dec-2009
నీ రూపు
ఇంతకుమునుపు నేనెన్ని కాలాలు నీతో గడిపిఉందును గాక
ఆఖరిసారి నా కనులు చిత్రించిన నీ రూపమేనాకపురూపమై
నా మనో:ఫలకం నా ముందు ఉంచుతుంది
కనులు మూసినా కనులు తెరిచినా...
... తిరిగి మరల నిన్ను గాంచేవరకూ
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 8:52 AM 0 మీ నుండి...
విభాగం ప్రేమ
నిస్తేజం
లోకమెపుడూ నిందిస్తుందని,
నగుబాట్లు, కట్టుబాట్లు వెల్లువెట్టుతాయని,
పాపపుణ్యాలు, సంప్రదాయాలు అసలంటూ ఉన్నాయని,
బంధాలు, బాధ్యతలూ బంధిస్తున్నాయని,
ప్రియా!...
కాలరాయబడిన ఉద్యమం లా
నిజాయితీతో నిండినదైనా మన ప్రేమ
అన్నిటి వెనుక ఉండిపోయింది
అసలేంకాకుండా పోతోంది...
తీపి జ్ఞాపకాలను మోసుకొంటూ
చేదు వాస్తవాన్ని తలచుకుంటూ ...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 8:05 AM 0 మీ నుండి...
విభాగం ప్రేమ
04-Dec-2009
మనలో మన మాట - 4
మనం దేనిని నెగ్లెక్ట్ చేస్తామో దానిని కోల్పోతాము, డబ్బును నెగ్లెక్ట్ చేస్తే డబ్బును, ప్రేమను నెగ్లెక్ట్ చేస్తే ప్రేమను, ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆరోగ్యాన్ని... చివరకు దేవుడ్ని నెగ్లెక్ట్ చేస్తే దేవుడ్ని కోల్పోతాము.
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 11:13 AM 3 మీ నుండి...
విభాగం మనలో మన మాట


