ఇష్టానికి మరణం ఉండదు
ఇష్టం ఉన్నపుడు కష్టానికి జననం ఉండదు!
ఇష్టానికి మరణం ఉండదు
ఇష్టం ఉన్నపుడు నష్టానికి జననం ఉండదు!
21-Dec-2010
ఇష్టం
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 6:51 PM 2 మీ నుండి...
విభాగం ప్రేమ
18-Dec-2010
అతను - ఆమె
అతను - చందమామ
ఆమె - వెన్నెలమ్మ
చందమామ, వెన్నెలమ్మ రెండు కాదు ఒకటే.
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 1:11 PM 0 మీ నుండి...
విభాగం ప్రేమ
16-Dec-2010
ప్రేమంటే...
ఒక్కోసారి అనిపిస్తుంది ప్రేమంటే -
"రెండు బలహీన హృదయాలు చాలా బలంగా ఇష్టపడడం" అని.
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 7:58 PM 1 మీ నుండి...
విభాగం ప్రేమ
మన ప్రాణాలన్నీ...
నా పంచ ప్రాణాలూ నీ ఒక్క ప్రాణమే అంటే
మన ప్రేమలో ఒక్కోసారి నాకు బలంగా అనిపిస్తుంది-
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 7:39 PM 2 మీ నుండి...
విభాగం ప్రేమ
15-Dec-2010
అహం-ప్రేమ
అహం ఉన్న మనసులో
ప్రేమ ఉండొచ్చు
కాని నిలవదు!
ప్రేమను కోల్పోయాక
అహం కూడా చచ్చిపోతుంది,
అప్పటికే అంతా మించిపోతుంది.
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 1:32 AM 1 మీ నుండి...
విభాగం ప్రేమ
ఇవ్వడమే కదా ప్రేమ
బంధం ఆకర్షణతో మొదలైనపుడు
ఆకర్షణ ఆశించడాన్ని నేర్పింది
ఆకర్షణ ప్రేమగా మారినపుడు
ప్రేమ ఇవ్వడాన్ని నేర్పింది.
ఎంతగా అంటే ఎంత ఇచ్చినా
ఇంకా ఏదో లోటు చేస్తున్నాననే...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 1:17 AM 2 మీ నుండి...
విభాగం ప్రేమ
మన మనసుకున్న మనుషులు
ప్రతి మనసుకి కన్నీరు ఉంటుంది
ఆనందంతో, దుఃఖంతో.
అవి మనసులో ప్రవేశించే మరో ప్రతి మనసుకి
ఒక అర్హత పత్రాన్నిస్తాయి!
ఏ ఒక్క మనిషి వలన మనకు
ఈ రెండు కన్నీళ్లు ఉంటాయో
వాళ్ళే మన మనుషులు,
మన మనసుకున్న మనుషులు.
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 1:04 AM 0 మీ నుండి...
విభాగం కన్నీటి బొట్టు
04-Dec-2010
నిర్దయ
ఆయుష్షుందని,
శరీరం శిధిలమైనా ప్రాణాన్ని బంధించి ఉంచే
ఆ దేవుని నిర్దయలాంటిదే
ప్రేమ చచ్చిపోయిన హృదయమున్న మనిషిని
జీవింపచేయడం కూడా!
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 6:03 PM 0 మీ నుండి...
నీ జ్ఞాపకాల సవ్వడి
కదలక కదలాలనిపించక
వలదని అన్నా,
వదలక మనసున చొరబడి,
ఏదో సడి... యదలో అలజడి...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 5:53 PM 1 మీ నుండి...
ప్రియురాలిని పారేసుకుంటే...
నాకిష్టమైన ఆణిముత్యాన్ని
అదృష్టం లేక పోగొట్టుకున్నాను
మీకు దొరికిందా, మీకు దొరికిందాని
నోరు తెరిచి, చేతులు చాచి అడగలేక
దీనంగా వీధుల వెంట కనులతో వెదుకుతున్నాను
అది ఎక్కడో జారి, ఎవ్వరినో చేరి
ఆనందాలను పంచుతూ ఉంటుంది,
ఆనందాలను పంచుకుంటూ ఉంటుంది?
పారేసుకున్న చోటు తెలుసు,
తెలిసినా వెదకలేను,
వెదికినా వేడుకలను చూడలేను...
తిరిగి నా ముత్యాన్ని ముత్యపు చిప్పలో
ఉంచి తెచ్చిఇచ్చినా,
అది నా ఆణిముత్యమవుతుందా?
ప్రేమ...
ఒకచోట కొందర్ని ఆనందసాగారాలలో తెలుస్తోంది అంటే,
ఎక్కడో ఒకచోట మరి ఇంకవరినో దు:ఖసముద్రంలో ముంచిందన్నమాటే!
కనీసం కొందరి విషయంలో...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 5:43 PM 2 మీ నుండి...
విభాగం విరాగం
03-Dec-2010
నర్తించే కన్నీరు
ప్రియా!
నీపై ప్రేమను హృదిలో,
నీ తాలూకు ఆలోచనలను మదిలో
అదిమిపెట్టి ఉంచడాన్ని
అధిగమించలేకపోతున్నాను.
మన జ్ఞాపకాల శిధిలాల మధ్య
మనసు రాసే గాయాల గేయాలకు
కన్నీరు నిరంతరం నర్తిస్తూనే ఉంటోంది...
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 10:06 PM 3 మీ నుండి...
విభాగం కన్నీటి బొట్టు

