నిదురరాని చోట ఒక అందమైన కలలా... నీళ్లులేని చోట ఎగిరొచ్చే అలలా... ఎదురొచ్చి ఆపై మనసిచ్చి ప్రభువిచ్చిన వరమై నాలో సగమై ఎదలో ఒదిగి ఆనక హిమమై ఎదిగి నిన్నే అర్పించి నన్నంతా గెలిపించి వ్యక్తమయ్యే నాలోఅవ్యక్తమయ్యే నువ్వు నా జీవన గానం... ప్రియ హిమ శైలం...
నాకు కలిగే బాధ అదొక తియ్యనిది నువ్వు దూరంగా ఉన్నావంటే నీ ఆలోచన నాకు దగ్గరవుతుంది నన్ను నేను కోల్పోతాను నువ్వే నేనవుతాను కన్నీళ్ళు వస్తాయి చిర్నవ్వూ వస్తుంది కాని ఇదేమీ ఎరుగని నన్ను చివరకి ఎవరో తట్టి పిలుస్తారు ఉలిక్కిపడ్డాక అప్పుడొక గాఢమైన నిట్టుర్పూ వస్తుంది... చివరికదొక నిత్యమై నిలుస్తోంది...