విషాదంలో ఉన్నాననుకుంటారంతా
నన్ను, ఈ ప్రపంచాన్ని కలగలిపి మర్చిపోయేంతగా
నీ తియ్యని జ్ఞాపకమొకటి మదిలోకొస్తుంది
కనులు శూన్యంలో నిలిచిపోతాయి
కాలం నన్ను దాటిపోతుంది
నవ్వు చెక్కిలి జారిపోతుంది...
చివరిగా ఈలోకంలోకి వస్తుంటే
కన్నీరు ఒలికిపోతుంది, విషాదంలో ఉన్నాననుకుంటారంతా!
27-Nov-2010
కన్ఫర్మ్డ్
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 1:05 AM
విభాగం కన్నీటి బొట్టు
Subscribe to:
Post Comments (Atom)


0 మీ నుండి...:
Post a Comment