నాకిష్టమైన ఆణిముత్యాన్ని
అదృష్టం లేక పోగొట్టుకున్నాను
మీకు దొరికిందా, మీకు దొరికిందాని
నోరు తెరిచి, చేతులు చాచి అడగలేక
దీనంగా వీధుల వెంట కనులతో వెదుకుతున్నాను
అది ఎక్కడో జారి, ఎవ్వరినో చేరి
ఆనందాలను పంచుతూ ఉంటుంది,
ఆనందాలను పంచుకుంటూ ఉంటుంది?
పారేసుకున్న చోటు తెలుసు,
తెలిసినా వెదకలేను,
వెదికినా వేడుకలను చూడలేను...
తిరిగి నా ముత్యాన్ని ముత్యపు చిప్పలో
ఉంచి తెచ్చిఇచ్చినా,
అది నా ఆణిముత్యమవుతుందా?
ప్రేమ...
ఒకచోట కొందర్ని ఆనందసాగారాలలో తెలుస్తోంది అంటే,
ఎక్కడో ఒకచోట మరి ఇంకవరినో దు:ఖసముద్రంలో ముంచిందన్నమాటే!
కనీసం కొందరి విషయంలో...
04-Dec-2010
ప్రియురాలిని పారేసుకుంటే...
Subscribe to:
Post Comments (Atom)


2 మీ నుండి...:
good one
Adrustam Meeke kadhu tanaki ledhemo...andhuke mimalni miss chesukundhi kachitamga badha paduthu untundhi.
Post a Comment