నీ మనసున ఉప్పొంగి పొంగే
నీ ప్రియురాలి జ్ఞాపకాలు ,
అవి సృష్టించే హృదయాగ్ని కీలలు
నిన్నే దహించి వేస్తున్నపుడు
ఆత్రంగా వాటినార్పడాన్కి
నిష్ప్రయోజనమైన ప్రయత్నం నేను చేస్తాను, విఫలమై
నిస్సహాయంగా కన్నీటిచుక్కనై వెలుపలికి వస్తాను -
దీనంగా ఆవిరౌతాను.
4 Nov, 2007
విఫలయత్నం
మీ కిన్నెరసాని కవితా ప్రసాద్ at 1:30 AM
విభాగం కన్నీటి బొట్టు
Subscribe to:
Post Comments (Atom)


0 మీ నుండి...:
Post a Comment