10 Nov, 2007

కౌగిలి ముద్దలు

విరహ వేదనలో నా ఆకలి నీకు దయను కలిగిస్తే
మల్లిపూవుల పక్క ఒకటి అరటియాకుగా నువ్వువేసి
తీపిముద్దులను నంజుకోసం
వేడి కోరికల అన్నం పెట్టి
తపన కౌగిళ్ళను ముద్దలుగా
వలపు పరువంతో తినిపించి - గెలుపు గుర్రాన్ని తలపించి
ఆకలంతటిని పంపేసి - నా యద వాకిటను నిదిరించే

నిన్ను నిమిరిన నాచేయి - ప్రేమను మించిన పైచేయి.

1 మీ నుండి...:

Share.blogspot.com said...

మీ రచనా శైలి కలిగించే అనుభూతి.. అచ్చం ప్రియురాలి ముద్దులో కలిగిన అనుభవంలా ఉంది..
మమ్మల్ని అలరించినందుకు థ్యాంక్స్.

ఇట్లు
ప్రకాష్, 99482 99593